మెంటాడ మండలం వానిజలో గురువారం పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియాకు సంబంధించిన ఉపాధ్యక్షులు, సెక్రటరీ ఎన్నికలు ఎంపీపీ స్కూల్ వద్ద గురువారం నిర్వహించారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్లు తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, ఎంపీడీవో భాను మూర్తి తెలిపారు. ఉపాధ్యక్షులుగా కెల్ల శంకర్రావు, కార్యదర్శిగా కెల్ల సన్యాసిరావు ఎంపిక అయినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణ అధికారి విమల కుమారి పాల్గొన్నారు.