మక్కువ మండలం భవిత కేంద్రంలోని లూయిస్ బ్రెయిలీ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈవో డి. శ్యామ్ పాల్గొని మాట్లాడారు. అంధుల పాలిట దేవుడు లూయిస్ బ్రెయిలీ అని అన్నారు. నేటి సమాజంలో కూడా అంధులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ రాయిడి శంకర్రావు, చిన్నయ్య, హెచ్ఎం దొర, శైలజ రవి తదితరులు పాల్గొన్నారు.