సాలూరు: నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

71చూసినవారు
సాలూరు: నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
సాలూరు మండలం నక్కడ వలస సమీపంలో నాటు సారా తయారీ కోసం నిలువ ఉంచిన పులిసిన బెల్లం ఊటలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేసారు. అటవీ ప్రాంతంలో కొంత మంది నాటు సారా కాస్తున్నట్లు సమాచారం అందిందని, ఆ మేరకు బుధవారం తన సిబ్బందితో వెళ్లామన్నారు. అయితే తాము రావడాన్ని గమనించి వారు పరారయ్యారన్నారు. దానితో అక్కడ ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిలువ ఉంచిన నాలుగు వందల లీటర్ల పులిసిన బెల్లం ఊటలను నేల పారబోసామన్నారు.

సంబంధిత పోస్ట్