సాలూరు: ఘనంగా పోలమాంబ జాతర

50చూసినవారు
సాలూరు: ఘనంగా పోలమాంబ జాతర
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, శంబర పోలమాంబ మారువారం జాతర మంగళవారం ఘనంగా జరిగింది. తొలి వారంలానే సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లన్నీ కిటకిట లాడాయి. చదురుగుడి వద్ద క్యూలైన్లు నిండిపోవడంతో భక్తజనం కొంత సమయం ఎండలోనే నిరీక్షించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ర్టాల నుంచి వచ్చిన వారు ఉదయం ఐదు గంటల నుంచే అమ్మవారి దర్శనానికి బారులుదీరారు.