సాలూరు: పండుగ పేరుతో రూ.లక్షలు స్వాహా చేశారు

74చూసినవారు
సాలూరు: పండుగ పేరుతో రూ.లక్షలు స్వాహా చేశారు
శ్యామలాంబ పండగ పేరుతో బ్లీచింగ్‌ పౌడర్‌, చీపుర్లు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం ప్రతిపాదించిన రూ.18 లక్షల్లో కొంత సొమ్ము కాజేయాలనే ఉద్దేశంతో మంత్రి సంధ్యారాణి అజెండా రూపొందించి, అధికారులపై ఒత్తిడి చేశారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ చెప్పారు. పండగ అభివృద్ధి పనులను మున్సిపల్‌ పాలకవర్గం అడ్డుకుందని మంత్రి సంధ్యారాణి ఆరోపించిన నేపథ్యంలో శుక్రవారం చైర్‌పర్సన్‌ ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరి రఘు, వైసిపి ఫ్లోర్‌ లీడర్‌ గొర్లి జగన్‌మోహన్‌ రావు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, మాట్లాడారు.

సంబంధిత పోస్ట్