ఆపరేషన్ సింధూర్‌కి, భారత సైన్యానికి మద్దతుగా సాలూరు పట్టణంలో తిరంగా యాత్ర ర్యాలీని మంత్రి సంధ్యారాణి శుక్రవారం నిర్వహించారు. ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి బోసుబొమ్మ జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశరక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు అంతా మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయం ఎదుట మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, సిఐలు అప్పలనాయుడు, రామకృష్ణ, అధికారులు, కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.