సీతంపేట మండలంలో పెద్దూరు గ్రామానికి చెందిన ఆరిక యగ్నిక్ అనే ఆరేళ్ల విద్యార్థి అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఇటీవల విశాఖపట్నం పోర్టు స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్న యగ్నిక్ మెరుగైన ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. ఈ బాలుడిని మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అభినందించారు.