ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎల్ కోట మండల అధికారులు అంతే ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం 12 గంటల సమయానికి మండలంలో 97 శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేసినట్లు ఎంపీడీవో రూపేష్ ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో 8762 మంది పెన్షన్ దారులు ఉండగా ఇప్పటికే 8465 మందికి వారి ఇళ్ల వద్దనే పెన్షన్ నగదు అందజేయడం జరిగిందన్నారు.