అటల్ టింకరింగ్ ల్యాబ్ మారధాన్ లో ఆల్ ఇండియా 117వ ర్యాంకు సాధించి కొత్తవలస మండలం అర్ధానపాలెం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ మారధాన్ లో దేశవ్యాప్తంగా 500 పాఠశాలలో ఎంపిక కాగా అందులో జిల్లా నుండి 5 పాఠశాలలు పాల్గొన్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. కాగా ఈ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు జిల్లా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు తెలిపారు.