కొత్తవలస మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ 12 గంటల సమయానికి 90 శాతం పూర్తి అయినట్లు ఎంపీడీవో రమణయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మండలంలో మొత్తం 21 సచివాలయాల పరిధిలో 9 వేల మంది పెన్షన్ దారులు ఉండగా 8 వేల 192 మంది పెన్షన్ లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో 126 మంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.