ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. శుక్రవారం ఎల్ కోట మండలం భీమాలిలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా రూ. 50. 60 లక్షల నిధులతో ఇంటింటికి కుళాయిలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో త్వరలో రూ.90 కోట్ల విధులతో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించనున్నట్లు ఆమె తెలిపారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.