జామి మండలంలో ఆదివారం మధ్యాహ్నం సమయానికి వాతావరణంలో ఒకసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. మండలంలో ఎం కొత్తవలస, అన్నంరాజుపేట తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షానికి వేసవి తాపం నుండి ప్రజలు ఉపసమనం పొందారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వేసవి నువ్వుల పంటకు అనుకూలంగా ఉంటుందని రైతులు అంటున్నారు. వర్షం పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.