ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విజయవాడ పర్యటనలో ఉన్నట్లు ఎల్కోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె శనివారం విజయవాడకు బయలుదేరి వెళ్లినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆది, సోమ, మంగళవారాల్లో ఎమ్మెల్యే లలిత కుమారి నియోజకవర్గంలో నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరని అన్నారు. బుధవారం నుండి యధావిధిగా ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.