ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు రానున్న నేపథ్యంలో విశాఖలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదివారం విశాఖకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విశాఖలో లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎల్ కోట ఆమె క్యాంపు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం అమలుపై ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.