శృంగవరపుకోట మండలం పెద్దఖండేపల్లి గ్రామంలోANM త్రినాధమ్మ ఆధ్వర్యంలో ఇంటింటా రక్త పరీక్షలు కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం నుండి ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించారు. 15 -49 సంవత్సరాల మధ్య గల మహిళలకు ఈ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మహిళలకు వెనువెంటనే హిమోగ్లోబిన్ శాతం పెరిగేందుకు మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.