వేపాడ మండలం ఆకుల సీతంపేట ఎంపీపీ పాఠశాలను ఎంఈఓ పి బాల భాస్కరరావు గురువారం సందర్శించారు. ఆగస్టు 8 న జరగనున్న స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కాపీని పాఠశాల నోటీసు బోర్డులో అతికించారు. అనంతరం పాఠశాల రికార్డులు తనిఖీ చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించి, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.