కొత్తవలస: గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కోఆర్డినేటర్

71చూసినవారు
కొత్తవలస: గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కోఆర్డినేటర్
కొత్తవలస మండలం వియ్యం పేట గురుకుల పాఠశాలను జిల్లా కోఆర్డినేటర్ ఎస్ రూపవతి గురువారం సందర్శించారు. ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ సక్రమంగా అమలు చేయాలని సూచించారు. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 10, ఇంటర్ విద్యార్థులకు సూచనలు, సలహాలు చేశారు. శత శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. ప్రిన్సిపల్ టి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్