కొత్తవలస ఎల్ సి గేటు వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జి గుండా వెళ్లే రహదారి ని రైల్వే అధికారులు గురువారం తాత్కాలికంగా మూసివేశారు. అండర్ బ్రిడ్జ్ రూఫ్ మరమ్మత్తులు పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో రోడ్డు ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో అటుగా వెళ్లే పలు గ్రామాల ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారి గుండా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరమ్మత్తుల పూర్తయిన తర్వాత ఈ రోడ్డు గుండా ప్రయాణాలు సాగించవచ్చని అధికారులు తెలిపారు.