కొత్తవలస: విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

72చూసినవారు
కొత్తవలస: విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
ఎల్ కోట మండలం రంగాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ నూకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు శుక్రవారం పాల్గొన్నారు. ముందుగా ఆయన అమ్మవారిని దర్శించుకుని అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక వైసిపి నాయకులు మాజీ ఎమ్మెల్యేకు ఘనంగా సత్కరించారు. మాజీ ఎంపీపీ గొరపల్లి శివ, చింతలపాలెం మాజీ సర్పంచ్ పల్ల భీష్మ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్