ఎస్ కోట మండలం గోపాలపల్లి సర్పంచ్ ఆడారి ఉమామహేశ్వరరావు చేతులు మీదుగా గురువారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు ఆయన స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ గురువారం శత శాతం పూర్తి కావాలని ఆయన అధికారులను కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత గల ప్రతి ఒక్కరికి అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.