కొత్తవలస మండలం ముసిరాం గ్రామపంచాయతీలో గురువారం జరగాల్సిన గ్రామ సందర్శన కార్యక్రమాన్ని వాయిదా చేసినట్లు ఎంపీడీవో రమణయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 1 గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో అధికారులు పాల్గొననున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. కాగా గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించనున్న తేదీని త్వరలో తెలియపరుస్తామని తెలిపారు.