రేగ పుణ్యగిరి గ్రామ సభలో గతంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలని గిరి శిఖరాగ గ్రామమైన రేగ పుణ్యగిరి గ్రామస్తులు, జనసేన నాయకుడు వబ్బిన సన్యాసినాయుడు ఎంపీడీవో సతీష్ కు శుక్రవారం కార్యాలయం వద్ద వినతి పత్రం అందజేశారు. సన్యాసినాయుడు ఎంపీడీవో సతీష్ తో మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం 4 కోట్లు విలువచేసే 4కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేసిందని అన్నారు.