ఎస్ కోట: రేషన్ డిపోలను తనిఖీ చేసిన సిఎస్డిటి

50చూసినవారు
ఎస్ కోట: రేషన్ డిపోలను తనిఖీ చేసిన సిఎస్డిటి
ఎస్ కోట మండలం వసి, తిమిడి, కొత్తూరు గ్రామాల్లో చౌక ధరల దుకాణాల డిపోలను సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా డిపో లలో గల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు స్టాక్ బోర్డులో రాసి పెట్టాలని తెలిపారు. కార్డు లబ్ధిదారులకు సక్రమంగా, సకాలంలో రేషన్ అందజేయాలని సూచించారు. కార్డుదారులకు రేషన్ సరుకులను పారదర్శకంగా పంపిణీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్