ఎస్ కోట: సత్తా చాటిన దొగ్గపేట ఎంపీపీ పాఠశాల విద్యార్థులు

84చూసినవారు
ఎస్ కోట: సత్తా చాటిన దొగ్గపేట ఎంపీపీ పాఠశాల విద్యార్థులు
ఇటీవల జరిగిన ఏపీ ఆర్ ఎస్ (ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాల) ఐదో తరగతి ప్రవేశ పరీక్షల్లో ఎస్. కోట మండలం దొర్గపేట ఎంపీపీ పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు. పాఠశాలకు చెందిన వజ్రపు శశి కుమార్ ప్రవేశ పరీక్షలో 100 మార్కులకు గాను 98 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. అలాగే తొత్తడి శిరీష 96 మార్కులు సాధించింది. ఈ మేరకు వీరిని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గేదెల నాయుడు తదితర ఉపాధ్యాయులు ఆదివారం అభినందించారు.

సంబంధిత పోస్ట్