ఎస్ కోట: ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

51చూసినవారు
ఎస్ కోట: ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ
ఎస్ కోట మండలం వశిలో నూతనంగా నిర్మించిన పురటాల పోలమ్మ తల్లి ఆలయంలో శనివారం నిర్వహించిన ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు పాల్గొన్నారు. అమ్మవారికి వైస్ ఎంపీపీ సుధారాణి, ఎస్ కోట సర్పంచ్ సంతోషి కుమారి తో కలసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్