రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎస్. కోట మండల అధికారులు అంతే ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎస్ కోట మండలంలో 11056 మంది పెన్షన్ దారులకు గాను గురువారం 10 గంటల సమయానికి 9733 మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ పూర్తయినట్లు ఈ ఓ పి ఆర్ డి లక్ష్మి తెలిపారు. 199 మంది సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.