వేపాడ హైస్కూల్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం ఆర్డిఓ దాట్ల కీర్తి పరిశీలించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక సౌకర్యాలపై ఆరా తీశారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తవహించాలని కోరారు. తాసిల్దార్ రాములమ్మ, ఉప తహసీల్దార్ సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.