విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఉప్పలపాటి రాజేష్ వర్మ బుధవారం సాయంత్రం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీ నాయనని మర్యాదపూర్వకంగా కలిశారు. బొబ్బిలి రాజకుటుంబంతో తమకు ఉన్న అనుబంధం, రాజకీయ పరిస్థితుల గురించి కొంతసేపు ఇరువురు మాట్లాడారు. రాజేష్ వర్మకి ఎమ్మెల్యే బేబీనాయన బొబ్బిలి వీణను బహూకరించి దుశ్శాలువాతో సత్కరించారు.