యువతిపై హత్యాచారానికి పాల్పడిన హోంగార్డును శాశ్వతంగా విధుల నుండి తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ప్రకటనలో తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడు సురేష్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్ల తెలిపారు. పోలీస్ శాఖలో ఉద్యోగులందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఈ తరహా చర్యలకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు