ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకి విజయనగరం జర్నలిస్టులు ఘనంగా నివాళలు అర్పించారు. ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పాత్రికేయులు శ్రీనివాసరావు, కోటీశ్వరరావు, నాయుడు, లక్ష్మణరావు మాట్లాడుతూ రామోజీరావు మరణం తెలుగు పత్రికా ప్రపంచానికి తీరని లోటని అన్నారు. 1936లో జన్మించిన ఆయన యాడ్ ఏజెన్సీలో ఉద్యోగిగా పనిచేసి, ఓ లక్ష్యంతో ఈనాడు పత్రికను నెలకొల్పారని అన్నారు.