నూతన సంవత్సరం సందర్బంగా కై. కొత్తపేటలోని మహారాణి అప్పలకొండయాంబ రాక్ గార్డెన్ లో శుక్రవారం దత్తసాయి వాకర్స్ క్లబ్ అధ్యుక్షురాలు సి. హెచ్. శేషశైలజ అధ్యక్షతన నెలవారీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రముఖ న్యాయవాది రాజు మాట్లాడుతూ.. కొత్త ఆలోచనలతో, సేవాకార్యక్రమాలు చేసి క్లబ్ ను ముందుకు నడిపించాలని క్లబ్ సభ్యులను ఆశీర్వదించారు. జనవరి నెలలో చేయబోయే కార్యక్రమాలకోసం ప్రణాళికను సిద్ధం చేసుకున్నామన్నారు.