విజయనగరం పినవేమలి గ్రామానికి చెందిన బాలి అప్పలనాయుడు అనే వ్యక్తికి ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అతనికి వైద్యం నిమిత్తం మందులు సంవత్సరం వరకు అందిస్తామని రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ప్రెసిడెంట్ నాగేశ్వరావు, సెక్రటరీ శంకర్ రెడ్డి తెలిపారు. ముందుగా శనివారం 2నెలలకు సరిపడా మందులను అందించారు.