విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి మహా కుంభమేళాకు 36 మంది భక్తులతో సూపర్ లగ్జరీ బస్సు బుధవారం బయలుదేరాయి. ఈ బస్సులను జిల్లా ప్రజా రవాణాధికారి హెచ్. అప్పలనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. భువనేశ్వర్, అనంతరం మహా కుంభమేళా త్రివేణి సంగమంలో స్నానం చేసి దర్శించుకుని 10వ తేదీన విజయనగరం చేరుకుంటారని డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. మరిన్ని వివరాలకు 99592 25620, 94943 31213 నెంబర్లను సంప్రదించాలని కోరారు.