విజయనగరం జిల్లాలోని కార్పొరేషను, మున్సిపాల్టీల్లో సహేతుకరమైన కారణం లేకుండా అర్ధ రాత్రుళ్ళు పట్టణాల్లో తిరిగితే టౌను న్యూసెన్సు చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. గత నాలుగు మాసాల్లో ఇప్పటికే 450 మందిపై టౌన్ న్యూసెన్సు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నేరాల నియంత్రణలో భాగంగా రాత్రి గస్తీ, పెట్రోలింగులో మౌళిక మార్పులు చేపట్టామన్నారు.