ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలు పై మూడు రోజుల్లో ప్రగతి నివేదికలను తయారు చేయాలని వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిపై కలెక్టరేట్లో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా 15 శాతం అభివృద్ది రేటు ఉండేలా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.