విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని, దీనిపై ఎక్సైజ్ శాఖ తక్షణ చర్యలు చేపట్టి వాటిని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎక్సైజ్ శాఖపై సమీక్షించారు. జిల్లాలో ఏయే ప్రాంతాల్లో బెల్టుషాపులు నడుపుతున్నారో తన వద్ద సమాచారం ఉందని వాటిని ఎక్సైజ్ శాఖ నియంత్రించలేని పక్షంలో తాను చర్యలు చేపట్టవలసి వస్తుందన్నారు.