విజయనగరం: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్
By k.chetan 65చూసినవారుప్రభుత్వం కల్పిస్తున్న వసతులను, అందుబాటులోని అవకాశాలను సోపానాలుగా చేసుకొని ఉన్నత స్థానానికి చేరాలని విద్యార్ధులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ పథకాన్ని విద్యార్థులంతా వినియోగించుకొని చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.