విజయనగరం: ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలి: కలెక్టర్
By k.chetan 64చూసినవారువిజయనగరం జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఖరీఫ్ 2025లో ప్రకృతి వ్యవసాయ ప్రణాళికపై కలెక్టరేట్ లో సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ప్రకృతి సేద్యం, దాని విస్తరణ, ఆవశ్యకత, ఉపయోగాలు, నూతన ప్రయోగాలు తదితర అంశాలపై చర్చించారు.