ఈ నెల 6వ తేదీ నుంచి మెడికల్ పెన్షన్ల రీ-వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని పూర్తిగా మంచానికే పరిమితమై పింఛన్ పొందుతున్న వారు 342 మంది ఉన్నారని, తొలి విడతలో వీరి పింఛన్లను రీ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు.