విజయనగరం జిల్లాలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పర్యటించారు. శుక్రవారం భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఏర్పాటు కానున్న సన్ రే - అవని గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కన్వెన్షన్ హాల్, గ్రీన్ హౌస్ నిర్మాణాలు భీమిలి మండలం అన్నవరం వద్ద మే ఫెయిర్ గ్రూప్ ఫైవ్ స్టార్ హోటల్ స్థలాన్ని, అన్నవరంలో ఒబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని పరిశీలించారు.