విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీస్టేషన్ పరిధిలోని నేరెళ్ల వలస గ్రామానికి చెందిన ఆరు నెలల పసికందుపై 40 ఏళ్ల బోయిన ఎరుకన్న దొర లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర్టులో నేరం రుజువు కావడంతో పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కె. నాగమణి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5వేలు జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాక్ శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు.