విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆదివారం ఏపీసీసీ రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్ కామన్ ప్రభాకర్ రావు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ మాట్లాడుతూ, విజయనగరంలో పలు సమస్యలైన షుగర్ ఫ్యాక్టరీ, రైస్ మిల్లులు, తోటపల్లి కాలువ, ఇతర ప్రాజెక్టుల గురించి వారి దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాడి రైతు సమస్యలు తీర్చాలని కోరారు.