సోమవారం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఎన్నికల పరిశీలకులు, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్, కొత్తవలస మండల కో ఆప్షన్ మెంబర్, గరివిడి మండలం సారిపల్లి ఉప సర్పంచ్ పదవులకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఆధరైజ్డ్ అధికారులతో జేసి తన ఛాంబర్ లో శుక్రవారం సమీక్షించారు.