జిల్లాలో వివిధ రంగాల్లో పని చేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారంలోగా ఖచ్చితమైన సంఖ్యను నివేదిక ద్వారా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ అధికారులకు ఆదేశించారు. బుధవారం అయన ఛాంబర్లో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో గుర్తించిన బాల కార్మికులకు పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని, పని చేయించుకుంటున్న సంస్థల పై పెనాలిటి లు వేయాలని, కేసులను నమోదు చేయాలన్నారు.