సమిష్టి కృషితో నగరాభివృద్ధికి చొరవ చూపుతున్నామని విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అత్యవసర సమావేశం జరిగింది. అజెండాలో పొందుపరిచిన 8 అంశాలపై చర్చ అనంతరం వాటిని సభ్యులు ఆమోదించారు. వివిధ అంశాలపై పలువురు కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించడం పట్ల పలువురు కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు.