ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు గుంటుబోయిన కుర్మారావు యాదవ్ పిలుపునిచ్చారు. విజయనగరంలో శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో దేవాలయ రక్షణ మన బాధ్యత. దీక్షతో అందరూ పాల్గొని హైందవ స్ఫూర్తిని ప్రదర్శించాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.