విజయనగరం జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థలో శిక్షణ పొందిన మహిళలంతా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ తెలిపారు. సాదించిన నైపుణ్యంతో మీరు ఉపాధి పొందుతూ మరో ముగ్గురికైనా ఉపాధి అవకాశాన్ని కల్పించాలని అన్నారు. శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్ లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 15 ట్రేడ్ లలో శిక్షణ పొందిన 30 మంది యువ మహిళలకు సర్టిఫికేట్లను అందజేశారు.