విజయనగరం జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 19 వరకూ ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు కొనసాగుతాయి. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అలాగే మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకూ రెండు ధపాలు జరగనున్నాయి. ఈనెల 5,6,7 తేదీల్లో ఒకేషనల్ విద్యార్థులకు, 10 నుంచి 19 వరకూ జనరల్ గ్రూపుల విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. ఒకేషనల్ విద్యార్థులు 30 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు.