విజయనగరం: రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జెసి

62చూసినవారు
విజయనగరం కేఎల్ పురంలో ఉన్న రామలక్ష్మణ ట్రెడర్స్ రైస్ మిల్లును జెసి ఎస్. సేతు మాధవన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులోని ధాన్యం నిల్వలను రికార్డులను పరిశీలించారు. బియ్యాన్ని శాంపిల్స్ తీసి, పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సమీపంలోని భారత ఆహార సంస్థ గోదాములను జెసి పరిశీలించారు. ఒక్కో గోదాములో ఉన్న బియ్యం నిల్వలపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్