పిఎం విశ్వకర్మ యోజన పథకం క్రింద జిల్లాలో 307 మంది లబ్దిదారులకు రుణాలు మంజురైనట్లు జిల్లా కలెక్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో పి. ఎం. విశ్వకర్మ యోజన పథకంపై సమీక్షించారు. 777 గ్రామ పంచాయ తీలు, 4 మున్సిపాలిటీలకు చెందిన 86, 225 దరఖాస్తులు అందాయని అన్నారు. శిక్షణ పూర్తి కాగానే టూల్ కిట్ కోసం ఎం. ఎస్. ఎం. ఈ శాఖ నుండి రూ. 15 వేలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.